మహారాష్ట్ర: ముంబైని వానలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో మహా నగరం నీట మునిగింది. దీంతో వరదనీరు రోడ్లపైకి భారీ వచ్చి చేరింది. రైల్వే పట్టాలు నీట ముగిగాయి. దేశ ఆర్థిక రాజధానిలో మంగళవారం రాత్రి నుండి వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) ప్రకటించింది. జూన్ 9 నుండి 13 వరకు ముంబై మరియు పరిసర ప్రాంతాలకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరిక జారీ చేసింది. వచ్చే 48గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయని అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలతో కొంకణ్ తీర ప్రాంతాలు వణుకుతున్నాయి. థానే, రాయ్ గఢ్, పుణే, బీడ్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. “బుధవారం ముంబైకి నైరుతి రుతుపవనాలు వచ్చినట్లు సూచనలు ఉన్నాయి” అని ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్ శుభంగి భూట్ పేర్కొన్నారు. ముంబైలో భారీ వర్షాలు పడటం వల్ల నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.
#WATCH | Maharashtra: Severe waterlogging at Kings Circle in Mumbai, due to heavy rainfall. #Monsoon has arrived in Mumbai today. pic.twitter.com/PI2ySwhBCR
— ANI (@ANI) June 9, 2021