Monday, December 23, 2024

ముంబై పేలుళ్ల కేసు నేరస్థునిపై తోటి ఖైదీల దాడి

- Advertisement -
- Advertisement -

1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న 59 ఏళ్ల మున్నా అలియాస్ మొహమ్మద్ అలీ ఖాన్ అలియాస్ మనోజ్‌కుమార్ భవర్‌లాల్ గుప్తా తోటి ఖైదీల దాడికి తీవ్ర గాయాలకు గురై ఆస్పత్రిలో మృతి చెందాడు. కొల్హాపూర్ లోని కలంబా సెంట్రల్ జైలు అధికారులు ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. జైలు బాత్ రూమ్ ఏరియాలో స్నానం చేస్తుండగా తోటి ఖైదీలతో ఏర్పడిన వివాదం ఘర్షణకు దారి తీసింది. విచారణ ఖైదీలు కొందరు ఈ ఘర్షణలో డ్రైనేజిపై ఉన్న ఇనుప చట్రాన్ని తొలగించి ఖాన్ తలపై బాదడంతో తల ఛిద్రమైంది.

దాంతో ఖాన్ కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్టు వెద్యులు వెల్లడించారు. దాడికి పాల్పడిన ఖైదీలు ప్రతీక్ అలియాస్ పిల్యా సురేష్ పాటిల్, దీపక్ నేతాజీ ఖోట్, సందీప్ శంకర్ చవాన్, రితూరాజ్ వినాయక్ ఇనాందార్, సౌరభ్ వికాస్‌లుగా గుర్తించారు. వారిపై కొల్హాపూర్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీస్ అధికారులు తెలిపారు. 1993 మార్చి 12న ముంబైలో ఒకేసారి వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిగి 257 మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News