ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్లు రియాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయారు. అద్భుతమైన బ్యాటింగ్‌తో అర్థశతకాలు సాధించి లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫలితంగా ముంబై.. లక్నో ముందు 216 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ(12) మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ రియాన్ రికెల్టన్ చెలరేగిపోయాడు. 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 58 పరుగులు చేసి దిగ్వేష్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ జట్టుకు అండగా నిలిచాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 54 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖర్లో నమన్ ధీర్, కార్బిన్ బాష్ మెరుపులు మెరిపించడంతో ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. లక్నో బౌలింగ్‌లో మాయంక్, అవేశ్ చెరి రెండు, ప్రిన్స్, దిగ్వేష్, రవి తలో వికెట్ తీశారు.