- Advertisement -
ముంబై : ఏడాది లోగా ముంబై గోవా హైవే పనులు పూర్తవుతాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. పదకొండు దశల్లో ఈ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ హైవేను మంగళూర్ వరకు పొడిగిస్తామని, ఈ హైవేపై ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే లాజిస్టిక్స్ పార్క్, ట్రక్ టెర్మినల్ లను ఏర్పాటు చేస్తామన్నారు. కొంకణ్ ప్రాంతంలో ప్రత్యేక ఆర్థిక మండలి ద్వారా త్వరలో 1.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సమకూరుతాయని తెలిపారు. రాయ్‌గఢ్ జిల్లాలో రూ.131.87 కోట్లతో చేపట్టిన మూడు జాతీయ రహదారుల ప్రాజెక్టులను గడ్కరీ ప్రారంభించారు. రూ.430 కోట్లతో 42 కిమీ పొడవైన రహదారుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
- Advertisement -