Monday, January 20, 2025

జైశ్వాల్ మెరుపు శతకంవృథా.. రాజస్థాన్‌పై 6వికెట్ల తేడాతో గెలిచిన ముంబయి

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఐపిఎల్ డబుల్ హెడర్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ముంబయి 6వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్లో టిమ్ డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లతో రెచ్చిపోవడంతో ముంబయి మరో మూడు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ముంబయి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20ఓవర్లలో 7వికెట్లకు 212పరుగులు చేసింది. ఆర్‌ఆర్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 62బంతుల్లో 16బౌండరీలు, 8సిక్సర్లతో 124పరుగులు చేసి అదరగొట్టాడు. జైశ్వాల్ తప్ప మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. బట్లర్ 18పరుగులు, కెప్టెన్ శాంసన్ 14, హోల్డర్ 11పరుగులు చేయగా మిగిలినవారు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.

ముంబై బౌలర్లలో అర్షద్‌ఖాన్ 3వికెట్లు, చావ్లా రెండు, మెరిడిత్, ఆర్చర్ చెరో వికెట్ తీశారు. అనంతరం రాజస్థాన్‌ నిర్దేశించిన 213పరుగుల భారీ లక్ష ఛేదనలో ముంబయికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 03పరుగులకే సందీప్‌శర్హ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇషాన్‌కిషన్ 28, కామెరన్ గ్రీన్ 44వికెట్లు అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సి గ్రీన్‌ను ఔట్ చేసిన రవిచంద్రన్ అశ్విన్ 300 టి20 వికెట్‌ల మైలురాయికి చేరుకున్నాడు. మొత్తంమీద ముంబయి బ్యాటర్లు సూర్య టిమ్‌డేవిడ్ 45పరుగులతో ముంబయిని గెలుపు తీరాలకు చేర్చారు. మొత్తంమీద ముంబయి 19.3ఓవర్లలో 214/4పరుగులు చేసి గెలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News