Wednesday, January 22, 2025

టిమ్ డేవిడ్ ఊచకోత… ఆ మూడు సిక్స్ లే ముంబయిని గెలిపించాయి

- Advertisement -
- Advertisement -

వాంఖేడ్: ఐపిఎల్ 11లో భాగంగా ముంబయి-రాజస్థాన్ మధ్య జరిగిన ఉత్కంఠపోరులో ముంబయి విజయం సాధించింది. చివరలో టిమ్ డేవిడ్ మెరుపులు మెరుపించడంతో విజయం సాధించింది. ముంబయి గెలుపులో కీలక పాత్ర పోషించిన టిమ్ డేవిడ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ముంబయి ముందు రాజస్థాన్ 213 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కామె రూన్ (26 బంతుల్లో 44 ), సూర్యాకుమార్ యాదవ్ (29 బంతుల్లో 55 పరుగులు), తిలక్ వర్మ(21 బంతుల్లో 29 పరుగులు) ధాటిగా ఆడారు. చివర్లో మాత్ర టిమ్ డేవిడ్ 14 బంతుల్లో 45 పరుగులతో ఊచకోతకోశాడు. 14 బంతుల్లోనే ఐదు సిక్స్‌లు రెండు పోర్లు ఉన్నాయి. చివర ఓవర్లో 17 పరుగులు చేస్తే ముంబయి గెలుస్తుంది. హోల్డర్ బౌలింగ్‌లో టిమ్ మూడు బంతుల్లో మూడు సిక్స్‌లు బాది విజయాన్నందించాడు. రాజస్థాన్ ఆటగాడు యశస్వి జైశ్వాల్ 62 బంతుల్లో 124 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News