Sunday, January 19, 2025

రంజీ విజేత ముంబయి

- Advertisement -
- Advertisement -

ముంబయి: రంజీ 2024 కప్ ముంబయి జట్టు కైవసం చేసుకుంది. వాంఖేడ్ లో జరిగిన రంజీ ఫైనల్ మ్యాచ్ లో ముంబయి జట్టు విజయం సాధించింది. విదర్భంపై ముంబయి 169 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురేసింది. విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 134.3 ఓవర్లలో 368 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ముంబయి 169 పరుగులు తేడాతో గెలుపొందింది. విదర్భ కెప్టెన్, కీపర్ అక్షయ్ వాడ్కర్ సెంచరీతో చెలరేగినప్పటికి వృధాగా మారింది. అక్షయ్ 102 పరుగులు చేసి తనూష్ కొటియన్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటైన తరువాత వరుసగా ఆ జట్టు వికెట్లు కోల్పోయింది. విదర్భ బ్యాట్స్‌మెన్లలో అక్షయ్(102), కరుణ్ నాయర్ (74), హర్ష దుబే(65) అథర్వ టైడ్(32), అమన్ మోకడే(32), ధ్రువ్ షోరే(28) పరుగులు చేసి ఔటయ్యారు. ముంబయి బౌలర్లలో తనుష్ కొటియన్ నాలుగు వికెట్లు, ముషీర్ ఖాన్. తుషార్ పాండే చెరో రెండు వికెట్లు, షమ్సీ ములాన్, ధావల్ కులకర్ణి చెరో ఒక వికెట్ తీశారు.

ముంబయి ఫస్ట్ ఇన్నింగ్స్: 224
విదర్భ ఫస్ట్ ఇన్నింగ్స్: 105
ముంబయి సెకండ్ ఇన్నింగ్స్: 418

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News