Friday, December 20, 2024

ముంబై అద్భుత విజయం

- Advertisement -
- Advertisement -

మొహాలీ: ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆరు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (30), మాథ్యూ షార్ట్ (27) పరుగులు చేశారు. ఇక లివింగ్ స్టోన్ 4 సిక్సర్లు, ఏడు ఫోర్లతో 42 బంతుల్లోనే అజేయంగా 82 పరుగులు చేశాడు. జితేశ్ శర్మ 49 (నాటౌట్) కూడా మెరుపులు మెరిపించాడు. అయితే తర్వాత భారీ లక్షంతో బరిలోకి దిగిన ముంబై 18.5 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (75), సూర్యకుమార్ యాదవ్ (66) అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు. తిలక్ వర్మ 26 (నాటౌట్), టిమ్ డేవిడ్ 19 (నాటౌట్) కూడా తమవంతు పాత్ర పోషించడంతో ముంబై ఘన విజయం అందుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News