Monday, December 23, 2024

ముంబై రచయిత్రిపై ఓ వ్యాపారి అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Mumbai Writer raped by businessman

రుణం ఎగ్గొట్టి దారుణం.. పైగా డి గ్యాంగ్ బెదిరింపులు

ముంబై : స్థానిక రచయిత్రిపై 75 ఏండ్ల వ్యాపారవేత్త అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. దీనితో ఆ ముదుసలిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్థానిక జుహూ ప్రాంతంలోని ఓ ఫైప్‌స్టార్ హోటల్‌లో ఈ వ్యక్తి తనపై లైంగిక చర్యకు పాల్పడినట్లు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఘటనపై మౌనంగా ఉండాలని, ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని దావూద్ గ్యాంగ్ పేరిట ఫోన్ వచ్చిందని, అందుకే చాలా రోజులు భయంతో ఏమి చేయలేకపోయినట్లు ఫిర్యాదులో ఆ మహిళ తెలియచేసుకుందని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సదరు వ్యాపారవేత్తపై ఐపిసి పరిధిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. స్థానిక అంబోలి పోలీసు స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. నిందితుడైన వ్యాపారవేత్త ఈ మహిళ నుంచి రూ 2 కోట్లు రుణంగా తీసుకున్నాడు. తిరిగి ఇవ్వడానికి సతాయిస్తూ వచ్చాడు. ఈ దశలో ఈ మహిళను ఫైవ్‌స్టార్ హోటల్‌కు రప్పించి అత్యాచారానికి పాల్పడ్డట్లు ఫిర్యాదు ద్వారా తెలిసింది. పైగా నిందితుడు తరచూ ఆమెను డి గ్యాంగ్ పేరు చెప్పి వేధిస్తూ వచ్చాడని వెల్లడైంది. ఈ కేసును ఇప్పుడు స్థానిక పోలీసు నుంచి ఎంఐడిసి పోలీసుకు బదలాయించారు. మహిళపేర్కొన్న అంశాలపై ఈ ప్రత్యేక బృందం ఆరా తీస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News