ఈజిప్టు: ఈజిప్టు లోని నైలునదీ తీర ప్రాంతం వెస్ట్‌బ్యాంక్‌లో కుబ్బత్ అల్ హవా అనే సమాధి నుంచి 10 పెద్ద మొసళ్ల మమ్మీలను వెలికి తీశారు. ఇవి రెండు వేర్వేరు తెగలకు చెందినవి. 2500 ఏళ్ల క్రితం చనిపోయిన మొసళ్ల తాలూకు మమ్మీలను చాలా భద్రంగా దాచిపెట్టారు. ప్రాచీన ఈజిప్టులో సంతానం ప్రసాదించే దేవతగా సొబెక్ అనే దేవతను ప్రార్థించేవారు. ఈ మొసళ్లను కూడా సంతానం ప్రసాదించే దేవ్లుగా భావించి వీటిని సంప్రదాయ కర్మకాండలతో మమ్మీలుగా చేసి ఆరాధించడం జరిగింది. ఈజిప్టు దేశ సంస్కృతిలో వేల సంవత్సరాలుగా మొసళ్లు కీలక పాత్ర వహించాయి.
సంతాన దేవతగా మొసళ్లు ఆరాధింపబడడమే కాకుండా ఆహార వనరులుగా కూడా మొసళ్లు వినియోగమయ్యేవి. వీటి శరీరం లోని కొన్ని అవయవ భాగాలు, కొవ్వు ఒంటి నొప్పులకు, పట్టతల పోడానికి ఔషధాలుగా వైద్యంలో ఉపయోగపడేవి. మొసళ్లే కాదు, చిత్తడి నేలల్లో ఉండే కొంగ వంటి పక్షులు, పిల్లులు, కొండముచ్చులు వంటి వాటి మమ్మీలు కూడా ఈజిప్టు సమాధుల్లో తరుచుగా సాధారణంగా కనిపిస్తుంటాయి.