- Advertisement -
అమరావతి: ఏడుకొండలకు ఆనుకూని ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వబోమని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. టిటిడి బోర్డు, అధికారులు తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు. ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో అన్యమతస్తులు పని చేయకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరూ అపచారం చేయొద్దని సూచించారు. గత ప్రభుత్వంలో అలిపిరి వద్ద ముంతాజ్, ఎమర్ దేవాలోక్ హోటల్స్ కు అనుమతులు ఇచ్చానన్నారు. ఆ హోటల్స్ అనుమతులను రద్దు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
- Advertisement -