- Advertisement -
‘లాకప్’ఆదివారం ఎపిసోడ్‌లో మునవ్వర్ ఫారూఖీ తన రహస్యాన్ని బయటపెట్టి ఎలిమినేషన్ నుంచి తప్పించుకోనున్నాడు.
ముంబయి: ‘లాకప్’ షోలో ఆదివారం తీర్పు దినాన పోటీదారుడు మునవ్వర్ ఫారూఖీ తన అవకాశాన్ని వినియోగించుకుని రహస్యాన్ని బయటపెట్టి ఎలిమినేషన్ నుంచి తనను తాను కాపాడుకోనున్నాడు. హోస్ట్ కంగనా రనౌత్ సూచన మేరకు అతడు వేగంగా బజ్జర్ నొక్కాడు. దాంతో తన తల్లికి సంబంధించిన రహస్యాన్ని చెప్పమని హోస్ట్ కంగనా రనౌత్ అతడిని అడిగింది.
అప్పుడు మునవ్వర్, ‘అది 2007 జనవరి… దాదాపు ఉదయం 7 గంటలవుతోంది. మా అవ్వ నన్ను లేపి, మా అమ్మకు ఏమో అవుతోంది అని చెప్పింది. మా అమ్మని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ నేను ఆసుపత్రికి చేరుకునేసరికి మా అమ్మని ఎమర్జెన్సీ వార్డ్ నుంచి బయటికి తీసుకొచ్చారు. ఆమె ఏడుస్తోంది. నేను ఆమె చేతిని పట్టుకుని ఉన్నాను. ఆ క్షణంలో డాక్టర్లు తమలో తాము మాట్లాడుకున్నారు. నన్ను మా అమ్మ చేతిని వదిలేయమన్నారు. దానిని నేను నేటికి మర్చిపోలేకున్నాను’ అని వివరించాడు. ఇదంతా విన్న సహపోటీదారు కరణ్‌వీర్ భోరా, అంజలీ అరోరా, జీషాన్ ఖాన్ అంతా భావోద్వేగానికి లోనయ్యారు. హోస్ట్ కంగనా రనౌత్ సైతం తన కన్నీరు తుడుచుకోవడం కనిపించింది.
ఇంకా ప్రమో వీడియో అతడి తల్లికి అసలు ఏమైందన్నది తెలుపలేదు. దీనికి ముందు అతడి మిత్రులు ‘ది క్వింట్’కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడారు. ‘కొన్నేళ్ల తరువాత మాకు బాగా సన్నిహితం అయ్యాక తన తల్లి ఎలా చనిపోయింది మునవ్వర్ మాకు తెలిపాడు. అప్పుడతడికి కేవలం 11 ఏళ్లే. తల్లి మరణం అతడిని బాగా ప్రభావితం చేసింది. నేటికి అది ప్రభావితం చేస్తోంది. అందుకే మేము దాని గురించి అతడిని ఎక్కువ ప్రశ్నించము’ అని అతడి మిత్రుడు సాద్ 2021 జనవరిలో తెలిపాడు.
మునవ్వర్ పేరు మోసిన కామెడియన్. గత ఏడాది ఓ షోలో హిందూ దేవతలపై జోక్‌లు వేసి అతడు వివాదంలోకి లాగబడ్డాడు. అరెస్టు కూడా అయ్యాడు. ఇప్పుడతడు షోలో బాగా ప్రసిద్ధుడైన కంటెస్టెంట్.
- Advertisement -