- Advertisement -
జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు వాడితే భారీ జరిమానా విధించనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. శనివారం జగిత్యాల పట్టణంలోని పలు దుకాణాల్లో మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మకాలు జరుపుతున్న యజమానులకు జరిమానా విధించారు. దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసులను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ నిషేధిత ప్లాస్టిక్ విక్రయిస్తున్నందుకు రూ.10 వేలు జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి ప్లాస్టిక్ కవర్లకు బదులుగా జ్యూట్ బ్యాగ్‌లు, బట్ట సంచులు వినియోగించాలని కోరారు. ఈ తనిఖీల్లో ఇంచార్జి శానిటరీ ఇన్స్‌పెక్టర్ బాలె అశోక్, కె.రాము, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ శ్రీకాంత్, ఎంఐఎస్ ఆపరేటర్ చందు, జవాన్‌లు పాల్గొన్నారు.
- Advertisement -