Tuesday, January 21, 2025

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్

- Advertisement -
- Advertisement -

గజ్వేల్ : మహిమాన్విత దేవాలయం గజ్వేల్ మహంకాళి దేవాలయం అని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ నేతి రాజమౌళి గుప్తా అన్నారు. శనివారం ఆయన గడా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డితో కలిసి మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాడబోనాల ఉత్సవంలో భాగంగా మహంకాళి దేవాలయంలో విశేష పూజలు హోమం నిర్వహించి భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో మహంకాళి దేవాలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కాలువ శ్రీదర్ రావు , భక్త బృందం ఆధ్వర్యలో లష్కర్ బోనాలకు ముందు ఆషాడ మాసం రెండవ వారంలో బోనాల ఉత్సవాలు నిర్వహణ ఘనంగా జరిగేదన్నారు. ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం ఆషాడ బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అమ్మవారికి ఆదివారం బోనాలు సమర్పించే కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహంకాళి అమ్మవారి కృప కటాక్షాలు పొందాలని నిష్టతో అమ్మవారికి బోనం సమర్పిస్తే అంతా శుభం కలుగుతుంది.

మహంకాళి అమ్మవారి ఆశీర్వాదంతో అందరు బాగుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, కౌన్సిలర్లు బొల్లి బాలమణి శ్రీనివాస్ రెడ్డి, బాగ్యలక్ష్మి దుర్గా ప్రసాద్, చందన రవీందర్, శీర్ల శ్యామల మల్లేశ్ యాదవ్, బాలేష్, ఆలయ పూజారి నందాబాల శర్మ, ఆలయ చైర్మన్ కాల్వ శ్రీదర్, శంకరయ్య, సిద్దిపేట జిల్లా యువజన అద్యక్షులు ఎన్‌సి సంతోష్ గుప్తా, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News