Monday, December 23, 2024

క్రీడా పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

- Advertisement -
- Advertisement -

పెబ్బేరు: ఎస్‌జిఎఫ్ అండర్ 14, 17 మండల స్థాయి క్రీడా పోటీలను స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ ఎద్దుల కరుణ శ్రీ సాయినాథ్ ప్రారంభించారు. బుధవారం పట్టణంలోని మోడల్ స్కూల్ ప్రాంగణంలో క్రీడా పోటీలను ప్రారంభించారు. మోడల్ స్కూల్, కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 14, 17 బాలబాలికల ఎస్‌జిఎఫ్ మండల స్థాయి కబడ్డీ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలలో ఆసక్తి కనబరిచి రాణించాలని కోరారు. క్రీడల వల్ల శరీరానికి కావలసిన వ్యాయామం, ఆరోగ్యం, దృఢంగా ఏర్పడుతాయని వివరించారు.

అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థన మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పట్టణ పరిధిలోని పిజెపి కార్యాలయ ఆవరణలో 10 ఎకరాల విస్తీర్ణంలో మినీ స్టేడియం నిర్మాణం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి, ఎంఇవో జయరాములు, ప్రిన్సిపాల్ రాయిస్ ఫాతిమా బేగం , బిఇడి, బిఇటి అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News