Monday, December 23, 2024

బిఆర్ఎస్ కి మునిసిపల్ ఛాంబర్ సంపూర్ణ మద్దతు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ జాతిపిత కెసిఆర్ ఏర్పాటుచేసిన బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఛాంబర్స్ రాష్ట్ర చైర్మన్ వెన్ రెడ్డి రాజు తెలిపారు. తెలంగాణ మున్సిపల్ ఛాంబర్స్ కార్యవర్గ సమావేశం సోమవారం ఈ మేరకు తీర్మానించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కెసిఆర్ కెటిఆర్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి, మిఠాయిలు పంచి పెట్టారు. అనంతరం వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ.. భారత రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీ మరో విప్లవం సృష్టించబోతుందని అన్నారు. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అవుతే అనేక ఆర్థిక సంస్కరణలతో పాటు అస్సాం పంజాబ్ కాశ్మీర్ లాంటి సున్నితమైన సమస్యలను పరిష్కరించి శాంతి యుత పరిస్థితులు నెలకొల్పారు.

అదే రాబోయే కాలంలో బిఅర్ఎస్ పార్టీ నేతృత్వంలో తెలంగాణ బిడ్డ కేసీఆర్ ప్రధాని పీఠం అధిరోహిస్తే రైతు రాజ్యస్థాపన, పట్టణీకరణ అనగారిన వర్గాలకు ఆర్థిక చేయూత సంస్కరణలకు కర్మాగారం లాంటి పథకాలు, తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా విస్తరణకు చోటు చేసుకుంటుందని అన్నారు. విద్యా వైద్యం హరిత పట్టణాలు వైకుంఠధామాలు మౌలిక సదుపాయాలు ప్రజల జీవన విధానం మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారని ఇదే స్ఫూర్తి బిఆర్ఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందన్నారు. మున్సిపల్ చైర్మన్లు దేశవ్యాప్తంగా పట్టణాల్లో పర్యటించి తెలంగాణలో చేపట్టిన పథకాలను విస్తృతంగా ప్రచారం నిర్వహించి కేంద్రంలో బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు మున్సిపల్ ఛాంబర్ కృషి చేస్తుందని వెన్ రెడ్డి రాజు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News