Wednesday, January 22, 2025

అభివృద్ధి పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రమణాచారి

- Advertisement -
- Advertisement -

నల్గొండ:నల్లగొండ పట్టణంలోని వార్డ్ నెంబర్ 48లో శుక్రవారం ఎన్టీఆ ర్ విగ్రహం నుండి శివాజీ నగర్ సర్కిల్, అక్కడి నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రా ంచ్ వరకు నిర్వహించిన (ఎన్సిఏపి ) నేషనల్ క్లీన్ హెయిర్ ప్రోగ్రాం 70 లక్ష నిధులను ద్వా రా నిర్వహించిన డ్రైన్ పనులను మున్సిపల్ కమిషనర్ రమణాచారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్జీ కాలనీ పార్కు అభివృద్ధికి 15 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం చేయాలని తెలిపారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్ కే వి. రమణ చారి కోరారు. హరిత శుక్రవారం కార్యక్రమాన్ని వార్డ్ కౌన్సిలర్, కాలనీ ప్రజలతో ఎన్జి కాలనీ పార్క్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని, వా టిని సౌరక్షించాలని సూచించారు.

నల్గొండ పట్టణంలో ఈరోజు నుండి ప్రతి ఎనిమిది వార్డుల చొప్పున ఇంటింటికి చెట్లు నాటే కార్యక్రమం జరుగుతున్నదని, వర్షాకాలం దృశ్యం సీజనల్ వ్యాధులు రాకుండా ప్రతి ఇంట్లో ప్రతి ఆదివారం పది నిమిషాల కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ యామ కవిత దయాకర్, ఏసిపి నాగిరెడ్డి, మున్సిపల్ డిఈ అశోక్, వెంకన్న, మున్సిపల్ ఏఈ దిలీప్, రవీందర్, సానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజ్, హరితహారం, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News