Tuesday, January 21, 2025

మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ద్ధీకరించాలి

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ద్ధీకరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ బీఆర్‌టీయూ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మున్సిప్ సీడీఎంఏకు రాష్ట్ర అధ్యక్షుడు చిలువేరు ప్రభాకర్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చాకా ఆరు వేల వేతనం ఉన్న కార్మికునికి రూ. 17 వేల వేతనం తెలంగాణ ప్రభుత్వం పెంచిందని కృతజ్ఞతలు తెలిపారు.

కాంట్రాక్టు కార్మికులందరినీ క్రమబద్దీకరించాలని, హెల్త్ ఇన్సూరెన్స్ రెగ్యుల్ ఎంప్లాయిస్ మాదిరిగా వర్తింపచేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు ఉండాలని, విధి నిర్వహణలో మృతిచెందిన వారికి ప్రమాద భీమా సౌకర్యం కల్పించి, హెచ్‌ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్ విధానం అమలుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మాదాసి నర్సింగరావు, గడ్డం సమ్మయ్య, నాయకులు నాయిని సతీష్, గజ్జల మహేందర్, బొచ్చు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News