Wednesday, January 22, 2025

చెప్పుతో చెంపలు వాయించుకున్న కౌన్సిలర్(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

అనకాపల్లి: ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయినందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మున్సిపల్ కౌన్సిలర్ తన చెప్పుతో తానే చెంపలు వాయించుకున్నాడు. ఈ సంఘటన సోమవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చోటుచేసుకుంది.

నర్సీపట్నం మున్సిపాలిటీలోని 20వ వార్డు కౌన్సిలర్ 40 ఏళ్ల మూలపర్తి రామరాజు కౌన్సిల్ సమావేశంలో తన నిస్సహాయ పరిస్థితిని ఈ చెప్పుతో చెంపలు వాయించుకుని వెళ్లగక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది.
తాను కౌన్సిలర్‌గా ఎన్నికై 31 నెలలు గడిచిపోయాయని, డ్రైనేజ్, విద్యుత్, పారిధుధ్యం, రోడ్లు వంటి ఇతర సమస్యలను తన వార్డులో ఏవీ పరిష్కరించలేకపోయానని రామరాజు తెలిపారు. సమస్యల పరిష్కారానికి అన్ని మార్గాలలో ప్రయత్నించానని, కాని తన ఓటర్లకు ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కదాన్ని నెరవేర్చలేకపోయానని ఆటోరిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్న రామరాజు చెప్పారు.

అధికార పార్టీ సభ్యుడిని కాను కాబట్టే మున్సిపల్ అధికారులు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 20వ వార్డును పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. తన వార్డులో ఒక్క మంచినీటి నల్లా కనెక్షన్ కూడా తాను ఇప్పించలేని పరిస్థితులలో ఉన్నట్లు ఆయన వాపోయారు.

ఓటర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయినందుకు కౌన్సిల్ సమావేశంలోనే చనిపోయినా బాగుండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి మద్దతుతో రామరాజు కౌన్సిలర్‌గా గెలుపొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News