Sunday, December 22, 2024

పురపాలక శాఖ సిగ్గుపడాల్సిన సమయం ఇది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: మంచి నీటి ట్యాంకులో వానరాల కళేబరాలపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్వీట్ చేశారు. పురపాలక శాఖ సిగ్గుపడాల్సిన విషయం ఇది అని మండిపడ్డారు. మంచినీటి ట్యాంకుల శుభ్రత, సాధారణ నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజారోగ్యం కంటే రాజకీయాలు ముఖ్యంగా మారాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని కెటిఆర్ ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ ఒకటవ వార్డు పరిధిలోని విజయ విహార్ పక్కన ఉన్న వాటర్ ట్యాంక్‌లో సుమారు 30 వరకు వానరాలు మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News