Sunday, January 19, 2025

పదవీ విరమణ చేసిన మున్సిపల్ డైరెక్టర్ డా.ఎన్.సత్యనారాయణ

- Advertisement -
- Advertisement -
సన్మానించిన మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

హైదరాబాద్: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ సంచాలకులు డా.ఎన్.సత్యనారాయణ పదవీ విరమణ సందర్భంగా ఆయన్ను మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ శుక్రవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. మున్సిపల్ విభాగంలో ఆయన అందించిన సేవలను కొనియాడారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన విశేష సేవలు అందించారని, కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయన నిర్విరామంగా కృషి చేశారని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆయన్ను ఘనంగా సన్మానించారు. జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులైన సందర్భంగా ఆయన్ను సన్మానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News