- Advertisement -
హైదరాబాద్ : తెలంగాణలో మినీ పురపోరు యథావిధిగా జరగనుంది. కరోనా దృష్ట్యా రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అన్న అంశంపై ఏర్పడిన గందరగోళానికి నేటితో తెరపడింది. కోవిడ్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తామని ప్రభుత్వం హమీ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ర్ట ఎన్నికల కమిషనర్ పార్థసారథి స్పష్టం చేశారు. రాత్రి 7గంటల నుంచి ఉదయం 8గంటల వరకు బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించారు. పోలింగ్ కు 72 గంటల ముందే ప్రచారం ఆపాలని ఆయన ఆదేశించారు. దీంతో 27వ తేదీ సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగియనుంది. ప్రతిఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఎస్ఇసి పార్థసారథి కోరారు.
- Advertisement -