Friday, November 15, 2024

మున్సిపల్ ఎన్నికలు నిలిపివేయలేం: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

High Court Stay on LRS implementation for 5 weeks

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ పై విచారణలో భాగంగా వాదనలు విన్న అనంతరం హైకోర్టు ధర్మాసనం ఎస్‌ఇసి, సర్కారుకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ అభ్యర్థనను ఎన్నికల సంఘం పరిశీలించాలని స్పష్టం చేసింది. అయితే, ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినందున, ఎన్నికలు నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు పేర్కొంది. ఈ అంశాన్ని ఎస్‌ఇసినే నిర్ణయిస్తుందని వెల్లడించింది. ఈ వ్యవహారంలో తదుపరి విచారణను జూన్ 7కి వాయిదా వేయడంతో పాటు ఎన్నికల ప్రక్రియ మొదలైన కారణంగా ఇప్పుడు నిలిపి వేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

Municipal elections cannot be stopped: TS High Court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News