Thursday, January 23, 2025

సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/భూదాన్‌పోచంపల్లి: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పోచంపల్లి మున్సిపల్ కార్మికులు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అర్హులైన మున్సిపల్ కార్మికులను మున్సిపల్ శాఖలో ఖాలీ పోస్టులలో విధుల్లోకి తీసుకోవాలని, అలాగే 2021 జూన్‌ నుండి, 2022 జూన్ వరకు ఏరియర్స్ చెల్లించాలని, కార్మిక సిబ్బందికి చలికోట్లు, యునిఫామ్స్, ప్రతి నెల వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని టిఆర్‌ఎస్‌కెవి నాయకులు కోరారు. ఈకార్యక్రమంలో టిఆర్‌ఎస్‌కెవి మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిలువేరు ప్రభాకర్, మండల అధ్యక్షులు కుక్క నరేష్, జిల్లా నాయకులు డిల్లీ మాధవరెడ్డి, సత్తయ్య, హరిక్రిష్ణ, నాగమ్మ, ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News