Saturday, November 23, 2024

మున్సిపల్ కార్మికుల చర్చలు సఫలం… సమ్మె విరమణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని, కొత్తగా నియమించిన కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, జీఓ నెంబర్ 60 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు ఇవ్వాలని, రెండో పిఆర్‌సి సూచించిన మధ్యంతర భృతి (ఐఆర్)ని అమలు చేయాలని తదితర పలు డిమాండ్లతో సెప్టెంబర్ 25న తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో యూనియన్ ప్రధాన నాయకత్వంతో సోమవారం జరిగిన చర్చలు ఫలప్రదం అయ్యాయి.

ఈ చర్చల్లో యూనియన్ ప్రతిపాదించిన డిమాండ్లపై సిడిఎంఏ అధికారులు సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ఆర్థిక పరమైన అంశాలను ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు అక్టోబర్ 10 నుండి తలపెట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పాలడుగు భాస్కర్, ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు మీడియాకు తెలిపారు. ఇంకా ఈ చర్చల్లో పాల్గొన్న యూనియన్ నేతల్లో జె. వెంకటేశ్, ఎర్రా నర్సింహులు, టి. ఉప్పలయ్య, డి.కిషన్, పి. సుధాకర్, బోట్ల భిక్షపతి, మహేశ్ , రఘు తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News