Monday, December 23, 2024

మున్నేరు రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: మున్నేరు రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశించారు. ఖమ్మం దానవాయిగూడెంలో మున్నేరు రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులను పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మంత్రి మాట్లాడారు. ప్రతిభావంతులైన వర్కర్లను నియమించి పనుల్లో లోపాలు తలెత్తకుండా చూడాలని, ఇప్పటికే నాలుగు నెలల సమయం వృధా అయిందని, ఫుల్ టైం నిర్మాణ పనులను చేపట్టి త్వరగా పూర్తి చేయాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.

పదిరోజుల్లో మళ్ళీ వస్తానని, పనుల్లో పురోభివృద్ధి లేకపోతే బాధ్యుల పై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పనుల్లో నాణ్యత లోపించిన ఊరుకునేది లేదని, రెవెన్యూ అధికారులు మున్నేరుకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఇరిగేషన్ అధికారులకు అప్పగించాలన్నారు. గోళ్ళపాడు సైడ్ డ్రెన్ల మాదిరిగా మున్నేరు సైడ్ డ్రైన్ లను నిర్మించాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సలహా ఇచ్చారు. స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ లను గుర్తించి సైడ్ డ్రైన్ ల నిర్మాణ పనులను చేపట్టాలని, తద్వారా మురికి నీరు మున్నేరు లో చేరకుండా ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News