Wednesday, January 22, 2025

మునుగోడులో కారు జోరు పక్కా!

- Advertisement -
- Advertisement -

Munugode by election 2022

ప్రచారంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డితోపాటు శివంపేట నాయకులు

మన తెలంగాణ/శివ్వంపేట: టిఆర్‌ఎస్ పార్టీ భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత బాగా బలం పెరిగిందని మునుగోడు ఉప ఎన్నికల్లో కారు జోరుతో దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మునుగోడు ఉప ఎన్నికల భాగంగా తనకు ఇంచార్జిగా ఇచ్చిన పిప్పలపహాడ్, అల్లాపూర్, ఎనగంటి తండాలలో నర్సాపూర్ నియోజక వర్గానికి చెందిన టిఆర్‌ఎస్ ము ఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి సోమవా రం ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మునుగోడు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్ర భాకర్ రెడ్డితో కలిసి మైసమ్మ దేవాలయంలో ప్ర త్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రజలను నేరుగా కలిసి కరచలనం చేస్తూ, కారు గుర్తుకు ఓటు వేసి, టిఆర్‌ఎస్ అభ్యర్థి అయిన ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు రైతుబంధు, 24 గంటల కరెంటు, రైతు బీమా, పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌లతో ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణలో ప్రతి ఎకరానికి నీరందించడానికి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని, అదేవిధంగా దక్షిణ భాగానికి సాగునీరు అందించడానికి రంగారెడ్డి ఎత్తిపోతలను తీసుకువచ్చారని దానిని పూర్తి చేసి తెలంగాణలో ప్రతి ఎకరానికి సాగునీరు, అదేవిధంగా ప్రతి మనిషికి తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. అనారోగ్యానికి ప్రైవేటు ఉన్నత వైద్యశాల ల్లో వైద్య సహాయం పొందిన ఎందరో అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. బిజెపి మతతత్వ పార్టీ అయితే కాంగ్రెస్ ప్రజలను పీక్కుతినే పార్టీ అన్నారు. ఈ రెండు పార్టీలు దొందు దొందేన ని వాటి నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈది నట్లే ఉంటుందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఓటు వేసే ముందు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని ఎన్నికల సందడిల పడి ఆగమాగం కావద్దని ఎమ్మెల్యే మదన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వెంటా మెదక్ జిల్లా ఎంపిపిల పోరం అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ, జిల్లా పరిష త్ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, టిఆర్‌ఎస్ శివ్వంపేట మండల పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, నాయకులు పైడి శ్రీధర్ గుప్తా, పోచ గౌడ్, కొండల్, లక్ష్మీనరస య్య, శ్రీనివాస్ గౌడ్ జంగం వెంకటేష్ రవినాయక్ అంజిరెడ్డి షేక్ అలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News