Monday, December 23, 2024

ఓటర్లు కెసిఆర్ ను మరచిపోయే పరిస్థితి లేదు…(వీడియో)

- Advertisement -
- Advertisement -

మునుగోడు: తమకు కరెంటు బాధ లేకుండా పోయిందని, పెన్షన్ బాధ లేకుండా పోయిందని, పంచాయతీలు లేకుండా ఇంటి ముందుకే నీళ్ళు వస్తున్నాయని, మాకు ఏ బాధ లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఓ వృద్ధుడు పాశం శివారెడ్డి ముచ్చటించారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా చండూరు 2, 3 వార్డులలో ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారం నిర్వహించారు. ఓటర్లు మాత్రం కెసిఆర్ ను మరచిపోయే పరిస్థితి లేదని, రేపు ఓట్లు మాత్రం టిఆర్ఎస్ పార్టీకే వేస్తారని, భారీ మెజార్టీతో టిఆర్ఎస్ గెలుస్తుందని వృద్ధుడు ధీమావ్యక్తం చేశాడు. కొందరు మధ్యలో వచ్చిన వాళ్లు డబ్బుల ఆశ చూపెడుతున్నాడని,  అలాంటి వాళ్లను నమ్మెటోల్లు ఎవరూ లేరన్నారు.

సిఎం కెసిఆర్ ఏం తక్కువ చేశారని, ఒకరిద్దరు పిచ్చి పిచ్చిగా, వంకర టింకర మాట్లాడుతున్నారని దుయ్యబట్టాడు. జనం ఆలోచన చేసుకోవాలని, తప్పుడు తోవన పోతే వాళ్ళే ఇబ్బంది పడుతారని, సిఎం కెసిఆర్ తప్పేం చేశారని శివారెడ్డి ప్రశ్నించాడు. తప్పు పని చేస్తే బాధ పడాలి కానీ.. కెసిఆర్ మంచి పనులు చేస్తున్నారని ప్రశంసించాడు. అక్కడ ఉన్న కార్యకర్తలు, ప్రజలు జై తెలంగాణ జై కెసిఆర్ నినాదాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News