Wednesday, January 22, 2025

రసవత్తరంగా ఉపపోరు

- Advertisement -
- Advertisement -

మొదలైన నామినేషన్ల పర్వం
అన్ని రాజకీయ పార్టీల్లో ఖరారైన ఉపఎన్నిక అభ్యర్థులు
తొలి రోజే రెండు నామినేషన్ల్లు దాఖలు

Munugode by election prediction

మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: తెలంగాణలో ఆసక్తి రేకెత్తిస్త్తున్న నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కావడంతో శుక్రవారం నుంచే నామినేషన్ల దా ఖలు కూడా ప్రారంభమైపోయింది తొలి రోజు సాయంత్రం 4 గంటలకు నామినేషన్ల దాఖలుకు గడువు ముగియగా… రెండు నామినేష న్లు దాఖలయ్యాయి. వీటిలో ప్రజా ఏక్తా పార్టీ నుంచి నాగరాజు దా ఖలు చేసిన నామినేషన్ ఒకటి కాగా.. రెండో దానిని స్వంత్ర అభర్థి గా మారం వెంకట్ రెడ్డి దాఖలు చేశారు.శుక్రవారం మొదలైన నామినేషన్ దాఖలుకు ఈ నెల 14తో గడువు ముగియనుంది. అయితే నామినేషన్ దాఖలుకు ప్రారంభమైన శుక్రవారం తర్వాత 2 రోజుల పాటు నామినేషన్ దాఖలేమి ఉండవు ఎందుకంటే.. సెలవు దినాలు రెండో శనివారంతో రేపు, ఆదివారంతో ఎల్లుండి నామినేషన్ల్ దాఖలు కు వీలు పడదు. ఇక సోమవారం నుంచి శుక్రవారం వరకు మా త్రమే నామినేషన్ దాఖలుకు గడువు ఉంది. కాంగ్రెస్ పార్టీకి, ఎ మ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడుకు ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఖరారైన అభ్యర్థులు..

మునుగోడు ఉప ఎన్నికకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యా రు. అయితే ముఖ్యమైన మూడు పార్టీల అభ్యర్థులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. మునుగోడులో ప్రదాన ంగా కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ మధ్యే పోటీ నెలుకొంది. మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరారు. తెలంగాణ అసెంబ్లీకి వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దింతో ఎలాగైనా అధికారంలోకి రావాలని బిజెపి గట్టి పట్టుదలతో వుంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో రాజీనామా చేయించి, బిజెపిలో చేర్చుకుని బరిలో దింపింది. కాం గ్రెస్, బిజెపిలు ఎంతో ముందుగా అభ్యరులను ప్రకటించాయి. కాం గ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, బిజెపి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తలపడుతున్నారు. తాజాగా బిఆర్‌ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని సిఎం కెసిఆర్ ప్రకటించారు. దీంతో మూడు పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. మునుగోడులో బిసి సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్, బిజెపిలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని నిలపడంతో బిఆర్‌ఎస్ బిసి వైపు చూస్తుందని అంతా భావించారు. కానీ బిసి అభ్యర్థిని కాకుండా మాజీ ఎమ్మె ల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ప్రకటించడం గమనార్హం.

రసవత్తరంగా మునుగోడు ఉప ఎన్నిక..

మునుగోడు ఉప ఎన్నిక మాత్రం రసవత్తరంగా మారనుంది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి దాన్ని స్పీకర్ ఆమోదించినప్పుడే మునుగోడు నియోజకవర్గంపై అన్ని పార్టీలు దృష్టి పెట్టేశాయి. ఇప్పటికే బిఆర్‌ఎస్-,కాంగ్రెస్,బిజెపి పార్టీల నేతలు మునుగోడు ప్రచార బరిలో దిగేశారు. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టికుని, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేస్తూ..అధికార బ లంతో సత్తా చాటాలని బిఆర్‌ఎస్ చూస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన రెండు ఉపఎన్నికల్లో బి(టీ)ఆర్‌ఎస్‌కు ఝలక్ ఇచ్చిన బిజె పి. .మునుగోడులో కూడా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. మ రో వైపు తమకు పట్టున్న స్థానంలో ఖచ్చితంగా గెలిచి తీరాలనే కసితో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఏదేమైనా గాని ఈ సారి మునుగోడులో మూడు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచేలా ఉంది..ఎవరిది గెలుపు అ నేది ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో బిజెపి తరుపున పోటీ చేసిన ఈటల రాజేందర్ గెలుపు పక్కా అని అందరికీ అర్ధమైంది. అందుకు తగ్గట్టుగానే ఆ యన విజయం సాధించారు. అదే పద్ధతిలో పోయి మునుగోడులో కూడా బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకోవాలని బిజెపి ప్రయత్నం చేస్తుంది. కానీ మునుగోడులో అలా చెప్పడానికి లేకు ండా పోయింది.. ఎప్పటికప్పుడు బలాబలాలు మారిపోతున్నాయి.

సర్వేలకు కూడా పక్కా రిజల్ట్ అంతు చిక్కడం లేదు. కానీ మెజారిటీ సర్వేలు మాత్రం బీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే అభివృద్ధి కోసం నిధులు విడుదల చేసి అన్ని వర్గాల ప్రజలకు ఆకుట్టుకోవడమే కాకుండా ము ందస్తుగా అన్ని వర్గాల ప్రజలకు వరాల జల్లులు కురిపించారు. ఈసారి ఎలాగైనా బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని అధికార పార్టీ యంత్రాంగం ముందుకు సాగుతోంది. కానీ ప్రస్తుత తరుణ ంలో ఎవరిని నమ్మే పరిస్థితి కనబడతలేదు. ఎవరిని ఎవరు మభ్యపెడుతున్నాయో తెలియని ఆయోమయానికి రాజకీయ పార్టీలు గురైన ట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ సమీకరణాలు ఒకేత్తు అయితే ఎ న్నిక జరిగే రోజు కూడా రాజకీయ సమీకరణాలు మరోలా మారిపోతాయని సంకేతాలు కనిపిస్తున్నాయి కాబట్టి.. మునుగోడులో ఎవరు సత్తా చాటుతారో అంచనా వేయలేని పరిస్థితిలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. మొత్తానికి మునుగోడు ఉప పోరు రసవత్తరంగా సాగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News