ఉపఎన్నికలో గెలుపు కోసం
అన్ని రాజకీయ పార్టీల ఎత్తులు
20న టిఆర్‌ఎస్, 21న బిజెపి పార్టీల
బహిరంగ సభలు
మనతెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడ నియోజకవర్గంలో ఉ పఎన్నికను టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నా యి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రజల మూడ్‌ను ప్రతిబింబించేదిగా భావిస్తున్న ఈ ఉపఎన్నికలో ఎలాగైనా విజయం సా ధి ంచాలని కంకణం కట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 21న బి జెపి మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధం అ వుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖు లు ఈ సభకు హాజరుకానున్నారు. అయితే అధికార టీఆర్‌ఎస్ పార్టీ అంతకంటే ముందే సభను నిర్వహించి బిజెపికి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 20న భారీ బహిరంగ సభను నిర్వహించాలని టీ ఆర్‌ఎస్ నిర్ణయించింది. ఇందుకు సభ వేదిక కోసం ఉమ్మడి న ల్లగొం డ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి శుక్రవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నారాయణపురం, చండూరు,మునుగోడులో స్థల పరిశీలన చే శారు.
ఐతే మునుగోడు టిఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరన్న విషయ ంలో టిఆర్‌ఎస్ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మాజీ ఎమ్మెల్యే కూసుకు ంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే తాము సహాకరించలేమని, నియోజకవర్గంలో ఉన్న 90 శాతం మంది జడ్పిటిసి, ఎంపిటిసి, సర్ప ంచ్‌లు, ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐతే అభ్య ర్థి ఎ ం పికపై మంత్రి జగదీష్ రెడ్డి, చోరవతో సరైన అభ్యర్థి ఎంపికపై కసర త్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బిజెపికి దీటుగా సభను ఏ ర్పా టు చేయాలని కాంగ్రెస్ సైతం బావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ల్లో ఉన్న అసంతృప్తి నేతలను బుజ్జగించే ప్రయత్నాలు కొ నసాగిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో మంచి పేరును సంపాదించిన పాల్యా యి స్రవంతి, కైలాష్‌లాంటి ఇతర నేతలను ఏఐసీసీ సెక్ర టరీలు గా ంధీ భవన్‌కు పిలిచి మాట్లాడుతున్నారు. మరోవైపు పార్టీ క్యా డర్ అం తా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట వె ళ్లకుండాతీసుకోవాల్సిన చర్యల గురించి వ్యూహాలకు పదనుపెడుతున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం
మునుగోడు నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజిక్కించుకోవాలని బిజెపి భావిస్తోంది. అందుకే ఈ ఉప ఎన్నికను ఛాలెంజింగ్‌గా తీ సుకుంది. మునుగోడులో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన నేతలు ఇ ప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఈ నెల 21న కేంద్రమ ంత్రి అమిత్ షా నేతృత్వంలో రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరనున్నా రు. ఆయనతో పాటు స్థానిక నేతలు బిజెపిలోకి రానుండటం ఆ పార్టీ కి కలిసిరానుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటి కే జి ల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు వలసలపై ఫోకస్ పె ట్టిన నేతలు.. ఇతర పార్టీల నాయకులకు చేర్చుకునేందుకు సకల ప్ర యత్నాలు చేస్తున్నారు. ఐతే మునుగోడుపై ప్రత్యేక దృష్టి సారించిన బి జెపి నాయకులు అక్కడే మకాం వేసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
బిజెపి రా ష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చు గ్, బండి సంజయ్ పాదయాత్ర లో పాల్గొన్నారు. ఇక చేరికల కమిటీ భేటీలో 21న జరగనున్న అ మి త్ షా బహిరంగ సభలో ఎవరెవరు పార్టీలో చేరుతారన్న అంశంపై స్పష్టత రానుంది. వీటితో పాటు టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్ర జల్లోకి బలంగా తీసుకెళ్లి దాన్ని క్యాష్ చేసుకునేందుకు బిజెపి యా క్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 22 తర్వాత బి జెపి నేతలంతా మునుగోడులోనే మకాం వేసి ఇంటింటికీ వెళ్లి టీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించారు. తాము అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాల గు రించి ప్రజలకు అవగాహన కల్పించాలని డిసైడయ్యారు.మొత్తమ్మీద హుజూరాబాద్ తరహాలోనే మునుగోడు ఉపఎన్నికల్లోనూ విజయం సాధిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టే అవకాశానికి మరింత చేరువవుతామని బిజెపి భావిస్తోంది.
కాంగ్రెస్‌కి జీవన్మరణ పోరాటం
మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు జీవన్మరణ పోరాటంగా మారి ంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంపై నేతలు ఫోకస్ పెట్టారు. ఉప ఎన్నికలో గెలిస్తేనే పార్టీ బతికి బట్టకడుతుందన్న అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు అందుకోసం గెలుపు కోసం అన్ని ప్రయత్నా లు చేస్తున్నారు. టికెట్ ఆశావహులు ఎక్కువ మంది ఉండటంతో తొ లు త ప్రజల్లోకి వెళ్లాలని, ఆ తర్వాతే అభ్యర్థిని ఎంపిక చేయాలని పీసీసీ నిర్ణయించింది. అసంతృప్తుల భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్న ట్లు తెలుస్తోంది. ఐతే సిట్టింగ్ సీటు గెలిస్తేనే ఫ్యూచర్ ఉంటుందని భావిస్తున్న కాంగ్రెస్ ఇప్పటి నుంచే జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతో ంది. ఇందులో భాగంగా శనివారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడులో ఆజాదీ గౌరవ్ యాత్ర చేపట్టనున్నారు. నారాయణ్ పూర్, చౌటుప్పల్ మండలాల్లో 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర ని ర్వహించనున్నారు. 16 నుంచి 20వ తేదీ వరకు మండలాలవారీ గా సమీక్ష నిర్వహించడంతో పాటు 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో కా ంగ్రెస్ జెండా ఎగరేయాలని నిర్ణయించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన పథకాలు, రాజగోపాల్ రాజీనా మా వెనుక కారణాలను ప్రజలకు వివరించాలని నేతలు భావిస్తున్నారు.
బిజెపి కన్నా ముందే టిఆర్‌ఎస్ సభ
21న జరిగే బిజెపి సభ కన్నా ముందే టీఆర్‌ఎస్ పార్టీ సభ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. బిజెపి, కాంగ్రెస్‌లతో పాటు అధికార టిఆర్‌ఎస్ పార్టీ కి సైతం మునుగోడు ఉప ఎన్నిక కీలకం కానుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన గత ఉప ఎన్నికల్లో హుజూర్ న గర్, నాగార్జున సాగర్, ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఐతే ముచ్చటగా మూడో ఉప ఎన్నిక కావడంతో ము నుగోడు ఉప ఎన్నికను అధికార టిఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లా నేతలతో ప్రత్యేకంగా స మావేశమై పలు అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా అమిత్ షా కన్నా ముందే టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించారు. ఈ నెల 20 మధ్యాహ్నం 2గంటలకు నిర్వహించనున్నట్లు తె లుస్తోంది. సభా వేదిక కోసం మంత్రి నారాయణపురం, చండూరు, మునుగోడులో స్థల పరిశీలన చేశారు.
అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ సభాస్థలిని ఫైనల్ చేయనున్నారు. ఐతే మాజీ ఎమ్మెల్యేపై స్థానికంగా వ్యతిరేకతఇదిలా ఉంటే మునుగోడు అభ్యర్థి ఎవరన్న విషయంలో టీఆర్‌ఎస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే కూసుకుంట్లకి టికె ట్ ఇవ్వవచ్చన్న వార్తలు వస్తున్నాయి. అయితే జిల్లాకు చెందిన 90 శాతం మంది జడ్పిటిసిలు, ఎంపిటిసిలు ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్ర ంగా వ్యతిరేకిస్తున్నాయి. జగదీశ్ రెడ్డి అండదండలు ఉండటంతో ఆ యన అభిప్రాయం మేరకు సీఎం కేసీఆర్ కూసుకు ం ట్ల వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.మరోవైపు మునుగోడు బై పోల్ ఎందుకు వచ్చిందన్న విషయం ప్రజలకు అర్థమయ్యేలా ప్రచా రం నిర్వహించాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. మనుగోడు ఉప ఎ న్నిక ఫలితం మీదే పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉందని, అది గెలవకపోతే క ష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో 2 0న జరగనున్న సభ అనంతరం టీఆర్‌ఎస్ యాక్షన్ ప్లాన్ అమలు చేయనుంది.