Sunday, January 19, 2025

రాజగోపాల్‌రెడ్డికి సిఇసి నోటీసు

- Advertisement -
- Advertisement -

రాజగోపాల్‌రెడ్డికి సిఇసి నోటీసు
31లోగా వివరణ ఇవ్వాలి
టిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ ఫిర్యాదుపై స్పందించిన సిఇసి
మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గం బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం రాత్రి నోటీసు జారీ చేసింది. నియోజకవర్గంలోని ఓటర్లకు సుశిఇన్‌ఫ్రా నుంచి రూ.5.2 కోట్లు అక్కడి ఓటర్ల ఖాతాలకు బదిలీ చేశారని టిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించి 31లోగా వివరణ ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డిని ఆదేశించింది. నియోజకవర్గ ఓటర్లను ప్రలోభపెట్టేందుకే కోట్ల నిధులను బదిలీ చేశారని భరత్‌కుమార్ ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 31లోగా ఇచ్చే వివరణ ఆధారంగా తమ నిర్ణయం ఉంటుందని ఎన్నికల సంఘం తన ఆదేశంలో పేర్కొంది. ఈ నోటీసు ప్రతిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా పంపింది. ఆయా ఖాతాలకు బదిలీ చేసిన నగదుకు వాడకుండా చూడాలని ఈసీ తన ఆదేశాల్లో పేర్కొంది.

Munugode Bypoll: CEC Issues Notice to Rajagopal Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News