Sunday, December 22, 2024

మునుగోడులో ఆశ్చర్యకరమైన మెజారిటీతో గెలుస్తాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడులో మోసగాళ్లకు, మొనగాళ్లకు మధ్య పోటీ జరుగుతుందని తెలంగాణ మంత్రి కెటిఆర్ చెప్పారు. హైద్రాబాద్ లోని తెలంగాణ భవన్‌లో మంత్రి కెటిఆర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలవాల్సిన అవసరం ఉందన్నారు. నల్లచట్టాలతో రైతులు, జిఎస్‌టితో చేనేత కార్మికులకు బిజెపి సర్కార్ అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. మునుగోడులో ఇప్పటివరనకు ఏం చేశామో, రానున్న రోజుల్లో ఏం చేస్తామో చెబుతూ ప్రచారం నిర్వహించామన్నారు.. కానీ మునుగోడులో మాత్రం చెప్పుకొనేందుకు బిజెపికి ఏమీ లేదని మంత్రి కెటిఆర్ ఎద్దేవా చేశారు. ఏళ్ల తరబడి ఉన్న ఫ్లోరోసిస్ సమస్యకు కూడ తమ ప్రభుత్వం పరిష్కారం చూపిందన్నారు. మతం పేరిట చిచ్చు పెట్టి రాజకీయం చేయడం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. నీళ్లిచ్చిన పార్టీకి, కన్నీళ్లు ఇచ్చిన పార్టీకి మధ్య పోటీ జరుగుతుందన్నారు. సోమవారం తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్‌పై బిజెపి నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశా రన్నారు. ఇవాళ పలివెలలో తమ పార్టీకి చెందిన నేతలపై దాడులు చేశారని ఆయన విమర్శించారు. నిరాశా , నిస్పృహలతోనే తమపై బిజెపి శ్రేణులు దాడులకు దిగాయన్నారు. మునుగోడులో ఓడిపోతామనే భయంతో బిజెపి ఈ దాడులకు పాల్పడిందన్నారు. బిజెపి ఉద్దేశ్యపూర్వకంగా దాడులు చేసిందని ఆయన విమర్శించారు. బిజెపి ప్రలోభాలకు లొంగవద్దని కెటిఆర్ ఓటర్లను కోరారు. మతం పేరిట చిచ్చు పెట్టే బిజెపి రాజకీయాన్ని పరిశిలించాలని ఆయన ప్రజలను కోరారు.
బిజెపి ట్రాప్‌లో పడొద్దు .. టిఆర్‌ఎస్ శ్రేణులకు హరీశ్ పిలుపు
మేమూ ఫైట్ చేయగలమంటూ వార్నింగ్
మునుగోడులో బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్‌పై టిఆర్‌ఎస్ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడిన ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఓటమి భయంతోనే టిఆర్‌ఎస్ కార్యకర్తలపై బిజెపి దాడి చేసిందని ఆయన ఆరోపించారు. ఇలాంటి సమయంలో టిఆర్‌ఎస్ కార్యకర్తలు సమన్వయం పాటించాలన్నారు. ఉపఎన్నికలో టిఆర్‌ఎస్ గెలవబోతోందనే బిజెపి కుట్రలకు పాల్పడుతోందని హరీశ్ రావు మండిపడ్డారు. బిజెపి కుట్రలో టిఆర్‌ఎస్ కార్యకర్తలు పడొద్దని, తాము కూడా గట్టిగా ఫైట్ చేయగలమన్నారు. వాళ్లపై వాళ్లే దాడి చేసుకుని టిఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేస్తున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Munugode Bypoll: KTR Speech at Telangana Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News