Monday, December 23, 2024

మునుగోడు రిటర్నింగ్ అధికారిపై ఇసి వేటు

- Advertisement -
- Advertisement -

EC special focus on Munugode by election

నల్లగొండ: మునుగోడు రిటర్నింగ్ అధికారిపై ఇసి వేటు వేసింది. ఆర్వోను మార్చాలని ఇసి నిర్ణయం తీసుకుంది. కొత్త ఆర్వో కోసం మూడు పేర్లను ఇసికి అధికారులు పంపారు. సాయంత్రంలోగా కొత్త ఆర్వో నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. యుగ తులసి ఫౌండేషన్ పిర్యాదుతో ఇసి ఈ నిర్ణయం తీసుకుంది. తనకు మొదటి రోడ్డు రోలర్ గుర్తు కేటాయించి తరువాత మార్చారని కేంద్ర ఎన్నికల సంఘానికి యుగ తులసి పార్టీ అభ్యర్థి శివ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శివకు రోడ్డు రోలర్ గుర్తు కేటాయిస్తూ ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News