Monday, December 23, 2024

మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఉప ఎన్నికలో గెలవాలని మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. ఓట్ల లెక్కింపు సమయం కోసం టెన్షన్‌తో కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్న అభ్యర్థ్ధుల భవితవ్యం ఇవాళ మధ్యాహ్నం వరకు తేలిపోనుంది.

ఇవాళ ఉదయం ఎనిమిది గంటలకు 680 బ్యాలెట్ ఓట్లను ముందుగా లెక్కిస్తారు. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నీ 80 ఏళ్ల వయస్సు పైబడిన సీనియర్ సిటిజన్స్, వికలాంగులు, అంగవైకల్యం చెందిన వారివేనని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఇవిఎం)లను అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలోనే తెరుస్తారు. ఒకే హాలులో 21 ఏర్పాటు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా అందులో 2,25,192 ఓట్లు (93.13 శాతం) ఓట్లు పోలయ్యాయి. మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 298 పోలింగ్ కేంద్రాల్లో 298 ఇవిఎంలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ముందుగా చౌటుప్పల్ మండలం నుంచే ప్రారంభిస్తామని, ఆ తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఒక్కొక్క రౌండ్‌లో 21 పోలింగ్ కేంద్రాల్లో ఇవిఎంలలోని ఓట్లను లెక్కిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News