Wednesday, January 22, 2025

బిఆర్‌ఎస్‌కు బోణి

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్ : మునుగోడు ఉపఎన్నికలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అమలు చేసిన వ్యూహం సూపర్ సక్సెస్ అయింది. ఆయన మాస్టర్ మైండ్ ముందు రెండు జాతీయ పార్టీ (బిజెపి, కాంగ్రెస్)లు బొక్కాబోర్లపడ్డా యి. తాను రంగంలోకి దిగితే….. ఎలా ఉంటుందన్న విషయా న్ని మునుగోడు విజయం ద్వారా కెసిఆర్ మరోసారి నిరూపించుకున్నారు. నియోజకవర్గంపై గులాబీ జెండాను రెపరెపలాడించారు. వచ్చే సంవత్సరంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ము నుగోడు ఉపఎన్నిక సెమీఫైనల్‌గా అన్ని రాజకీయ పార్టీలు భావించాయి. ఈ నేపథ్యంలో విజయం కోసం అన్ని అస్త్రాలను ఉపయోగించాయి. అయి తే మునుగోడు ప్రజలు మాత్రం సిఎం కెసిఆర్‌కు మద్దతుగా నిలిచారు. దీంతోమునుగోడులో భారీ మెజార్టీతో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. గులాబీ విజయాన్ని అడ్డుకునేందుకు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మొదటి నుంచి సర్వశక్తులను పణంగా పెట్టి పోరాడాయి. అయినప్పటికీ ఆ పార్టీలకు షాక్ తప్పలేదు. కెసిఆర్ వ్యూహాల ముందు ఆ పార్టీలు పూర్తిగా తేలిపోయాయి.

ఓటర్ల పల్స్‌ను పసిగొట్టడంలో తనకు మించిన వారు మరొకరు లేరని కెసిఆర్ నిరూపించుకున్నారు. టిఆర్‌ఎస్‌కు బిజెపికి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ కారు విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. ఇక కాం గ్రెస్ పార్టీ అయితే ఏ దశలోనే టిఆర్‌ఎస్‌కు నామమాత్రం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఏ రౌండ్‌లోనూ కాంగ్రెస్ పార్టీ తన సత్తాను చాటుకోలేక పోయింది. చివరకు ఆ పార్టీ డిపాజిట్‌ను సైతం కోల్పోవాల్సి వచ్చింది. మునుగోడు ఉపఎన్నిక కోసం అదిరిపోయే వ్యూహాన్ని అమలు చేసిన కెసిఆర్…..ఐప్యాక్ బృందంతో పాటు, ఇత ర సర్వే సంస్థలు, ప్రభుత్వ నిఘా విభాగాలు ఇచ్చిన నివేదికలను ఎప్పటికప్పుడు తెప్పించుకున్నారు. వాటిపై అధ్యయనం చేశారు. టిఆర్‌ఎస్ పార్టీకి ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను చక్కదిద్దుకోవడం కోసం ఏం చేయాలన్న అంశంపై ప్రతి రోజు కెసిఆర్ కసరత్తు చేశారు. ఈ నేపథంలో మునుగోడులో విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఉన్న టిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గానికి సుమారు 2 వేల మంది పార్టీ కార్యకర్తలను ప్రచారానికి పంపింది. మునుగోడులో ప్రచార హోరు అదరగొట్టేలా పక్కా వ్యూహాలను అమలు చేసింది.ప్రతి రోజూ టెలికాన్ఫరెన్స్ ద్వారా నేతలతో మాట్లాడిన కెసిఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఎక్కడ ఏ ప్లాన్ అమలు చేయాలో ప్రగతి భవన్ నుంచే సూచనలు ఇచ్చారు.

సామాజికవర్గాల వారీగా, గ్రామాల వారీగా ప్రజలను ఆకట్టుకునేందుకు కెసిఆర్ సరికొత్త ప్రయోగాలను మునుగోడులో అమలు చేశారు. ప్రతి గ్రామానికి ఒక ఎంఎల్‌ఎను ఇన్‌ఛార్జీగాగా నియమించారు. ఆ గ్రామంలో ఖచ్చితంగా మెజారిటీ వచ్చే విధంగా స్ట్రాటజీని అమలు చేశారు. ఆ గ్రామాల్లో ఏ సామాజికవర్గం అధికంగా ఓటర్లు ఉంటే ఆ సామాజికవర్గం నేతనే ఇన్ ఛార్జిగా నియమించారు.ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి మొదలుకుని పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ప్రగతి భవన్ నుంచి కెసిఆర్ ప్రతిరోజు పర్యవేక్షించారు. షెడ్యూల్ రాకముందు ఒకసారి….పోలింగ్ ప్రక్రియ ముగిసే రెండు రోజులకు ముందు మరోసారి టిఆర్‌ఎస్ భారీ బహిరంగ సభలను నిర్వహించింది. ఈ రెండు సభలకు సిఎం కెసిఆర్ హాజరై బిజెపిని టార్గెట్‌గా చేసుకుని పదునైన విమర్శలు చేశారు. ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత పెరిగిపోయి గ్యాస్, పెట్రోల్, డీజిల్‌తో పాటు నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ విషయాన్ని ఓటర్ల మనస్సులోకి తీసుకవెళ్లడంలో పార్టీ శ్రేణులు విజయం సాధించాయి. అలాగే గా నియోజకవర్గానికి పద్నాలుగు మంది మంత్రులతో పాటు డ్బ్బై మందికిపైగా శాసనసభ్యులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అలాగే ఎంపీలు, శాసనమండలి సభ్యులతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ అగ్రనేతలంతా మునుగోడులో మకాం వేసే ప్రచారం సాగించే విధంగా కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి వందమంది ఓటర్లకు ఒక ఇన్‌ఛార్జీని నియమించారు. ఆ ఇన్‌ఛార్జీలు ప్రతి రోజు వందమంది ఓటర్లను నేరుగా కలిసే విధంగా పక్కా ఆదేశాలను జారీ చేశారు. వారితో ప్రతి రోజు సిఎం కెసిఆర్ టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణలను పరుగులు తీయించారు. అదే సమయంలో ప్రత్యర్ధి పార్టీల ప్రచారం తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. వారి ప్రచారానికి దీటుగా టిఆర్‌ఎస్ ప్రచారాన్ని కూడా ముందుకు పరుగులు తీయించారు.

బిజెపి, కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలను గులాబీ గూటికి చేరుకునే విధంగా కెసిఆర్ రచించిన ప్రణాళిలు నూటికి నూరుశాతం విజయవంతం అయ్యాయి. ఒకవైపు టిఆర్‌ఎస్ అభ్యర్ధి పక్షాన ప్రచారం సాగిస్తూనే….మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షమ పథకాలను పార్టీ శ్రేణులు మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రణాళికలను రచించారు. ముఖ్యంగా ఆసరా పెన్షన్లు, రైతుబంధు వంటి పథకాలను అమలు చేస్తున్న కెసిఆర్‌కు అండగా నిలువాలని కోరుతూ పార్టీ శ్రేణలు సాఘించిన ప్రచారం కూడా గులాబీ విజయానికి నిచ్చెన వేశాయి. ఇక బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి రూ. 18వేల కోట్లకు ఆశపడే కాంగ్రెస్ నుంచి కమలం పార్టీలో చేరారని టిఆర్‌ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది. ఇది కూడా గులాబీ విజయంలో కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది.

కలిసొచ్చిన వామపక్షాల పొత్తు
్లమునుగోడులో బలంగా ఉన్న వామపక్షాలను తనవైపుకు తిప్పుకోవడంలో కెసిఆర్ విజయం సాధించారు. ఒకప్పుడు ఈ నియోజకవర్గం వామపక్షాలకు పెట్టని కోటగా నిలుస్తూ వచ్చింది. అయితే రాష్ట్ర విభజనతో పాటు ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణల కారణంగా ప్రధాన పార్టీలతో వామపక్షాలు పోటీపడలేకపోయాయి. ఈ నేపథ్యంలో మునుగోడులో వారి ప్రాబల్యం ఉన్నప్పటికీ…అది గెలిచే స్థాయిలో లేకుండా పోయింది. దీంతో వారికి ఇతర పార్టీల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటే తెప్ప గెలవలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన సిఎం కెసిఆర్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోగానే సిపిఐ, సిపిఎం అగ్రనేతలతో మంతనాలను పూర్తి చేశారు. ఆ పార్టీలకు చెందిన అభ్యర్ధులను బరిలో నిలబడకుండా జాగ్రత్తపడ్డారు. అలాగే వామపక్షాలు ఇతర పార్టీలకు మద్దతు తెలపకుండా నియంత్రించ గలిగారు. వారు టిఆర్‌ఎస్‌కే మద్దతు తెలిపిలా ఒప్పించగలిగారు. ఇలా విజయానికి దోహదపడే ఏ అంశాన్ని కూడా కెసిఆర్ వదిలి పెట్టలేదు. దీంతో మునుగోడులో టిఆర్‌ఎస్‌కు ఎదురు లేకుండా పోయింది. ఆ పార్టీ అభ్యర్ధి ఘన వ ఘన విజయం సాధించగలిగారు.

హ్యాట్రిక్ విజయం
ఉమ్మడి నల్గొండ్‌లో మూడు నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగింటే….మూడింటిలోనూ టిఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ ఇచేసిన అప్పటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఘన విజయం సాధించారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన నల్గొండ జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆయన హుజూర్‌నగర్ నియోజకవర్గానికి రాజీనామా చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఆ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో టిఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. తదనంతరం నాగార్డునసాగర్‌కు ఉపఎన్నిక వచ్చింది.

ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన టిఆర్‌ఎస్ శాసనసభ్యుడు నోముల నర్సిమయ్య అనారోగ్యం కారణంగా మరణించారు. దీంతో ఉపఎన్నికల అనివార్యంగా మారింది. ఈ ఎన్నికలో కూడా టిఆర్‌ఎస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంది. ఇక తాజాగా మునుగోడులో కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి…ఆ పార్టీతో పాటు ఎంఎల్‌ఎకి పదవికి కూడా రాజీనామా చేసి బిజెపిలో చేరారు. దీంతో మూడవ ఉపఎన్నిక మునుగోడు నియోజకవర్గానికి జరిగింది. ఈ ఎన్నికలోనూ టిఆర్‌ఎస్ పార్టీ తనకు ఎదురులేదని నిరూపించుకుంది. ఈ నియోజకవర్గాన్ని కూడా గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నట్లు అయింది.

జిల్లాలో క్లీన్‌స్వీప్
రాష్ట్ర రాజకీయ చరిత్రలో గులాబీ పార్టీ సంచలనం సృష్టించింది. మొట్ట మొదటి సారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న12 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన ఏకైక పార్టీగా సరికొత్త రికార్డు సృష్టించింది. మునుగోడు విజయంతో ఆ పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకొని క్ల్లీన్ స్వీప్ చేసింది. దీంతో నల్గొండ గులాబీ పార్టీకి కంచుకోటగా మారింది. ఒకప్పుడు హస్తం పార్టీకి కంచుకోటగా నిలిచింది. ప్రస్తుతం కాంగ్రెస్ కంచు కోటలు అన్ని మంచు కొండల్లా కరిగి పోయాయి. ఇక బిజెపి పార్టీ ఇప్పటి వరకు జిల్లాలో బోణి కూడా చేయలేదు.

బిఆర్‌ఎస్‌కు పునాది
మునుగోడు విజయంతో బిఆర్‌ఎస్ పార్టీకి పునాది పడినట్లు అయింది. జాతీయ స్థాయిలో బిజెపిపై పోరుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వచ్చిన ఉపఎన్నికలో భారీ మెజార్టీతో విజయం అందించాలని కెసిఆర్ ఇచ్చిన పిలుపుకు మంచి స్పందన లభించింది. నియోజకవర్గం ప్రజలంతా ఆయనకు మద్దతు పలికారు. కారును మంచి మెజార్టీతో గెలిపించారు. ఈ విజయంతో బిఆర్‌ఎస్ పార్టీ పేరుతో ఇక జాతీయ స్థాయి రాజకీయాల్లోకి కెసిఆర్ అడుగుపెడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News