హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి రేపు సాయంత్రం 6.00 గంటల నుంచి తెరపడనుంది. కాగా పోలింగ్‌కు అంతా సిద్ధం అయినట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. మునుగోడులో ఓటు హక్కులేని వారు ప్రచారం ముగిసిన తర్వాత అక్కడ ఉండకూడదన్నారు. నవంబర్ 3న ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. మునుగోడు నియోజకవర్గంలో 2.41 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, 298 పోలింగ్ కేంద్రాలున్నాయని ఆయన తెలిపారు. అన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇప్పటి వరకు 185 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. సరైన ఆధారాలు లేని రూ. 6.80 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
#Telangana ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ #Hyderabad లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మునుగోడు ఉప ఎన్నిక పోలింగుకు ఏర్పాట్లన్నీ సిద్దం చేసినట్లు చెప్పారు. pic.twitter.com/47ykgiQG1b
— AIR News Hyderabad (@airnews_hyd) October 31, 2022