Thursday, January 23, 2025

మునుగోడు ఎంఎల్ఎ… ఇచ్చిన హామీలేవి?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మునుగోడు: మునుగోడు మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఫేస్ మాస్క్ ధరించి ఓ యువకుడు వినూత్న నిరసన తెలిపాడు. మునుగోడు మండలంతో పాటు మండల కేంద్రాన్ని ఏ విధంగాను అభివృధ్ది పరచలేదని ఆవేధనతో పందుల నరేష్ అనే యువకుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామిలు ప్రభుత్వ కళాశాల, 100పడకల హాస్పిటల్, రెవెన్యూ డివిజన్, డబుల్ బెడ్‌రూమ్, సోలిపురం బ్రిడ్జి తదితర హామీలను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మాత్రమే మునుగోడు మండల కేంద్రంలో నిర్మించి, ప్రజలకు ఉత్త చేతులు చూపించాడని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News