Saturday, December 21, 2024

“అమ్మే దైవం” వీడియోను విడుదల చేసిన మురళీ మోహన్

- Advertisement -
- Advertisement -

“ఈ రోజు నేను ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించడానికి రెండు ప్రధానకారణాలు ఉన్నాయి . మొదటిది నేను ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 1973 మార్చినెలలో షూటింగ్‌ మొదలయి హీరోగా పరిచయమై 50 ఏళ్ళు పూర్తయియ్యాయి. ఈ శుభ సందర్భంగా ఒక్కసారి మీరందరితో ఈ విషయాన్ని పంచుకుందామని. అలాగే నన్ను హీరోగా పరిచయం చేసిన అట్లూరి పూర్ణచంద్రరావు గారికి, పి.వి. సుబ్బారావుగారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.

నేను ఎప్పుడూ కూడా నా కెరియర్‌లో నాకు ఇన్ని ఏళ్ళ సినీ ప్రయాణం ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను మొదటిసారి సినిమాకి వచ్చినప్పుడు నాకు 33ఏళ్ళు ఉంటాయి. ఏదో ఒక 15ఏళ్ళు ఉంటానేమో అనుకున్నా. కానీ అదృష్టం కలిసిరావడం వల్ల అందరూ సహకరించడంతో నాకు ఈ అవకాశం కలిగింది. మన తెలుగు జర్నలిస్టులను చూసి నేను చాలా ఆనందపడుతుంటాను. ఎందుకంటే ఇతర భాష జర్నలిస్టుల్లా ఎల్లో జర్నలిజం ఉండదు. ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్క హీరో గురించి ఆర్టిస్టు గురించి ఎక్కువగా పాజిటివ్‌గా మాత్రమే రాస్తారు. వేరే భాషా జర్నలిజంలో ఎక్కువ శాతం నెగిటివ్‌నెస్‌ తప్ప పాజిటివ్‌ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ మన తెలుగు జర్నలిజం గురించి చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది.

నేను అనుకోకుండా సినిమా యాక్టర్‌ని అయ్యాను. మొదటి నుంచి నాకు బిజినెస్‌ మీద ఎక్కువగా ఇంట్రస్ట్‌ ఉండేది. మధ్యలో అనుకోకుండా రాజకీయాల్లోకి వెళ్ళాను. తప్పని సరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చింది. దాంతో ఒక పదేళ్ళు సినిమాలకు బ్రేక్‌ వచ్చింది. వ్యాపారం కూడా నా కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. ప్రస్తుతం అవన్నీ పూర్తిగా వదిలేసి కంప్లీట్‌గా సినిమాలకు అంకితం అవ్వాలనుకుంటున్నాను. నేను అక్కినేని నాగేశ్వరరావుగారి అభిమానిని ఆయన సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉండేవాడిని నేను చనిపోయేంతవరకు కూడా నేను సినిమాల్లో నటిస్తూ ఉంటాను అన్నారు. అలాగే ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించినప్పటికీ చివరగా ఆయన మనం చిత్రంలో నటించారు. నాగేశ్వరరావుగారే నాస్ఫూర్తి.

నేను కూడా ఆయన లాగే ఇక నటనకే అంకితం అవుతాను. ఇక. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టటానికి మరో ముఖ్య కారణం
రేపు మే14న మదర్స్‌ డే సందర్భంగా ‘ మిథునం చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ వీణపాణి గారు ఒక పాటను రచించారు. దీన్ని మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని నన్ను అడిగారు. అయితే ఆ పాటతో పాటూ మన హీరోలందరి తల్లుల ఫొటోలను వేసి ఒక చిన్న వీడియో రూపంలో దాన్ని విడుదల చేద్దామని అన్నాను. రత్నాల్లాంటి బిడ్డలను కళామతల్లికి అందించిన ఆ రత్న గర్భాల గురించి కూడా తెలుసుకుందామని చెప్పాను. దాంతో ఆయన సరే అని అన్నారు. చాలా శ్రమపడి అందరి ఫొటోలను సేకరించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఈ వీడియో కూడా బాగా వచ్చింది. అమ్మే దైవం అనే పాటను విడుదల చేయడం జరిగింది.

సీనియర్‌ జర్నలిస్టు ప్రభు మాట్లాడుతూ… మురళీమోహన్‌ గారి గురించి మనం ఇప్పుడు కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదు. ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలను మనకు అందించారు. సినిమా ఇండస్ట్రీ నటీనటులు అంటే ఇలా ఉంటారు విచ్చలవిడిగా ఉంటారు. అన్నవాటికి పూర్తి భిన్నంగా ఆయన ఉంటారు. సమాజంలో ఇండస్ట్రీ పై ఉన్న ఆలోచనకు పూర్తి భిన్నంగా ఉంటుంది ఆయన లైఫ్‌స్టైల్‌. ప్రతిదీ కూడా ఎంతో క్రమశిక్షణతో ఆయన నడవడిక ఉంటుంది.

సీనియర్‌ జర్నలిస్టు వినాయకరావు మాట్లాడుతూ.. జగమే మాయ చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చి జయప్రధంగా ఎన్నో అద్భుతమైన చిత్రాలను ఆయన అందించారు. ఇక పై కూడా ఆయన సినీ జీవితం అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను.

సీనియర్‌ జర్నలిస్టు సురేష్‌కొండేటి మాట్లాడుతూ… మురళీమోహన్‌గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంతో సీనియర్‌ యాక్టర్‌. అమ్మ పాటను విడుదల చేసి మనందరికీ మరొక్కసారి మన అమ్మ గొప్పతనం గురించి గుర్తు చేసి కళ్ళు చెమర్చేలా చేశారు.

సీనియర్‌ జర్నలిస్టు నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ… ఇలాంటి అమ్మపాటలను చేయాలంటే చాలా మంచి ఆలోచనలు ఉండాలి. అది అందరి వల్లా కాదు సామాజిక విలువలు, మానవత్వపు విలువలు పట్ల ఒక ఇంట్రస్ట్‌ ఉండాలి. ఈ పాటతో ఒక్కసారిఆ అందరి కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News