Sunday, December 22, 2024

సింగపూర్ క్యాబినెట్‌లో మురళీ పిళ్లైకి చోటు

- Advertisement -
- Advertisement -

సింగపూర్ నూతన ప్రధాని లారెన్స్ వాంగ్ ఏర్పాటు చేయనున్న కొత్త క్యాబినెట్‌లో న్యాయ, రవాణా శాఖ మంత్రిగా భారతీయ సంతతికి చెందిన పార్లమెంట్ సభ్యుడు మురళీ పిళ్లై నియమితులు కానున్నారు. కొత్త ప్రభుత్వంలో మంత్రిగా జులై 1న 56 ఏళ్ల మురళీ పిళ్లై ప్రదవీ స్వీకార ప్రమాణం చేస్తారని స్థానిక మీడియా సోమవారం తెలిపింది. మిగిలిన మంత్రులు మే 15న ప్రమాణం చేస్తారు. అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ సభ్యుడైన పిళ్లై వృత్తిరీత్యా న్యాయవాది. వాంగ్ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా కెబాలకృష్ణన్,

హోం వ్యవహారాల, న్యాయ శాఖ మంత్రిగా కె షణ్ముగం, ప్రధాన మంత్రి కార్యాలయంలో మంత్రిగా ఇంద్రానీ రాజా కొనసాగుతారు. వీరంతా భారతీయ సంతతికి చెందిన నాయకులే. కొత్త క్యాబినెట్ కూర్పు గురించి సింగపూర్ ప్రధాని కార్యాలయం సోమవారం ప్రకటించింది. ప్రస్తుత ప్రధాని లీ సీన్ లూంగ్(72) బుధవారం వైదొలగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో నూతన ప్రధానిగా వాంగ్ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టనునాఊ్నరు. లూంగ్ 20 ఏళ్ల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News