Monday, December 23, 2024

భార్యను వేధిస్తున్నాడని… ఐస్ ముక్కతో పొడిచి….

- Advertisement -
- Advertisement -


ఢిల్లీ: తన భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ యువకుడిని ఆమె భర్త ఐస్ ముక్కతో పొడిచిన సంఘటన ఢిల్లీలో టాగోర్ గార్డెన్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ వ్యక్తి తన భార్యతో కలిసి టాగోర్ గార్డెన్ ప్రాంతంలో నవిసిస్తున్నాడు. పక్కింట్లో ఉండే యువకుడు ప్రతీ రోజు ఆమెను వేధించేవాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో భార్య తన భర్తకు అతడి గురించి తెలిపింది. వెంటనే భర్త వెళ్లి ఆ యువకుడితో గొడవకు దిగాడు. మంచు ముక్కతో యువకుడి కంట్లో పొడిచారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News