Thursday, January 23, 2025

వివాహేతర సంబంధం.. ఒకరి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Man Murdered in Anantapur

మనతెలంగాణ/ కీసర : వివాహేతర సంబంధంతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని గోధుమకుంట గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ రఘువీర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. యాదాద్రి-భువనగిరి జిల్లా యా దగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామానికి చెందిన రుద్రబోయిన బాలరాజు గౌడ్ (36) గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపార రీత్యా గత నాలుగు సంవత్సరాల క్రితం భార్య మమత, ఇద్దరు పిల్లలతో కలిసి వలసవెళ్లి ఉప్పల్‌లోని అద్దే ఇంట్లో ఉంటున్నాడు. ఉప్పల్‌లో వీరి ఇంటి పక్కనే ఉండే రమేష్ భార్య మంజులతో బాలరాజ్ గౌడ్‌కు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

మంజుల దంపతులకు ఇద్దరు కొడుకులు విషయం భ ర్త రమేష్‌కు తెలియడంతో ఇద్దరిని పలుసార్లు హెచ్చరించాడు. దీంతో బా లరాజు గౌడ్ మంజులను కీసర మండలం గోధుమకుంట గ్రామంలోని మైత్రినగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వీరి ఆచూకీ తె లుసుకున్న రమేష్ ఆదివారం అర్ధరాత్రి తన ఇద్దరు కొడుకులు అరుణ్, త రుణ్‌లతో పాటు మంజుల ఇద్దరు సోదరులతో కలిసి అక్కడికి చేరుకొని రమేష్ బాలరాజుతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో రమేశ్ కర్రతో దాడి చేసి ఇటుకతో అతని తలపై కొట్టాడు.దీంతో బాలరాజుగౌడ్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News