- Advertisement -
కూకట్ పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబికా నగర్ కాలనీలో ఓ వ్యక్తి మహిళ గొంతు కోసి హత్య చేశాడు. మిర్యాలగూడ కి చెందిన శారాద అనే మహిళ హరికృష్ణతో గత 8 నెలల క్రితం హైదరాబాద్ కు వచ్చి నివాసం ఉంటుంది. రవి అనే వ్యక్తి తో పెళ్ళి కాగా హరికృష్ణ తో సహజీవనం ఉంటుంది. ఇటివల శారద పై హరికృష్ణకు అనుమానం రావడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి, తరచు గొడవపడుతుండేవారు. బుధవారం గొడవపడిన హరికృష్ణ కత్తితో శారద గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -