Monday, December 23, 2024

ఎమ్మెల్సీ సోదరుడి దారుణ హత్య…

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పెండేకల్ రైల్వే జంక్షన్‌లో దారుణం చోటుచేసుకుంది. వైఎస్ఆర్సిపి మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు పూజారి రామును దుండగులు దారుణంగా హత్య చేశారు. పూజారి రాము గతంలో నల్లమల ఫారెస్ట్ లో బోనాసి దళం కమాండర్ గా పనిచేసినట్లు తెలుస్తోంది.

అలాగే ఆర్ఎస్ యు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. రాము మానసిక పరిస్థితి సరిగా లేక మతిస్థితి కోల్పోయి పెండేకల్ రైల్వే జంక్షన్ లోనే ఉంటున్నాడని స్థానికులు తెలిపారు. కాగా శనివారం రాత్రి దుండగులు రాళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న తుగ్గలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఆర్ఎస్ పెండేకల్లు లో రాము అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News