Friday, November 22, 2024

భార్య,కూతురి హత్య కేసులో జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భార్య, కూతురిపై కిరోసిన్ పోసి హత్య చేసిన నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం…రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, గ్రామం అంగడి బజార్‌కు చెందిన ఎరుకలి రోజా(25), అదే గ్రామానికి చెందిన ఎరుకలి రాజును ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరికి శ్రావణ్(4), కీర్తన(ఏడాదిన్నర) ఉన్నారు. జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో రాజు భార్య రోజాను తరచూ శారీరకంగా, మానసికంగా వేధించేవాడు.

ఈ క్రమంలోనే ఫిబ్రవరి 14,2019లో సాయంత్రం 5.30 గంటల సమయంలో ఇంట్లో పిల్లలతో ఉండగా రాజు వచ్చాడు. వెంటనే భార్యతో గొడవ పెట్టుకున్నాడు, ఇలాగే వేధిస్తే పిల్లలపై కిరోసిన్ పోసి తాను పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. వెంటనే నిందితుడు భార్య రోజా, కూతురు కీర్తనపై కిరోసిన్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సాక్షాలు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టడంతో వాటిని పరిశీలించిన కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News