సిటీబ్యూరో: మద్యం తాగి తమ కుటుంబాలను భూతులు తిడున్నాడని ఓ వ్యక్తిని హత్య చేసిన ఇద్దరు నిందితులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్, బహదూర్‌పుర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఫలక్‌నూమా ఎసిపి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 13వ తేదీన కాలాపత్తర్‌కు చెందిన షేక్ ఖాసీం అలియాస్ ఆశు హత్యకు గురయ్యాడు. దానమ్మ హట్స్ సమీపంలోని హెచ్‌ఎండబ్లూస్ అండ్ ఎస్‌బి వాటర్ ప్లాంట్ సమీపంలో రక్తం మడుగులో పడి ఉ న్నాడు. కుటుంబ సభ్యులకు సమాచారం రావడంతో వెం టనే ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బహదుర్‌పుర పోలీసులు దర్యాప్తు చేశారు.
షేక్ ఖాసీం, సయిద్ యూసుఫ్, సయిద్ ఫజల్ కలిసి రోజు మద్యం తాగేవారు. సయిద్ యూసుఫ్‌పై బహదుర్‌పుర పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. ఫజల్ కూలీ పని చేసేవాడు, ముగ్గురు కలిసి కల్లు దుకాణంలో రోజు కల్లు తాగే వారు. ఈ క్రమంలోనే తనకు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని షేక్ ఖాసీం ఇద్దరిని వేధించేవాడు. సయిద్ యూసుఫ్, ఫజల్ డబ్బులు ఇవ్వకపోవడంతో వారి కుటుంబ సభ్యులను భూతులు తిట్టేవాడు. దీంతో వారికి ఖాసీంపై కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 13వ తేదీన ముగ్గురు కలిసి కల్లు తాగారు. అప్పటికే ఇద్దరు తెచ్చుకున్న కత్తులతో ఖాసీంపై ఇద్దరు దాడి చేశారు. దీంతో ఖాసీం అక్కడికక్కడే మృతిచెందాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్లు సుధాకర్, సంతోష్‌కుమార్ కలిసి నిందితులను పట్టుకున్నారు.