Sunday, December 22, 2024

గన్‌మెన్ల కోసం తనపై తానే మర్డర్‌ప్లాన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సమాజంలో పేరు కోసం, తనకు గన్‌మెన్లు కేటాయించాలని ప్లాన్ వేసిన ఓ పార్టీ నాయకుడు తనకు తెలిసిన వారితో హత్యాయత్నాం చేయించుకున్నాడు. ఈ కేసులో ఆ నాయకుడితోపాటు ఆరుగురు నిందితులను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి ఇన్నోవా కారు, రెండు బైక్‌లు, రూ.2లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో మల్కాజ్‌గిరి డిసిపి పద్మజా గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

బోడుప్పల్‌కు చెందిన బిజేపి నాయకుడు భాస్కర్ గౌడ్ బిజేపి హిందూ ప్రచార కమిటీ అధ్యక్షుడు, సినీనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. భాస్కర్ గౌడ్‌పై జంటనగరాల్లోనో పోలీస్ స్టేషన్లలో ఏడు కేసులు ఉన్నాయి. తనకు గన్‌మెన్లను కేటాయించకపోవడతో సమాజంలో గౌరవంలేదని భావించాడు. తన వెంట గన్‌మెన్లు ఉంటేనే సమాజం గౌరవిస్తుందని కున్నాడు. దీనికి తనకు తెలిసిన వారితో తనపై హత్యాయత్నం చేయించుకోవాలని ప్లాన్ వేశాడు. వెంటనే వారిని పిలిచి రూ.2,50,000 ఇచ్చియ భాస్కర్ గౌడ్ హత్యాయత్నానికి ప్లాన్ వేశాడు.

తాను చనిపోకుండా కత్తులతో పొడవాలని ఒప్పందం చేసుకున్నాడు. మొత్తం ఎనిమిది మంది కలిసి ప్లాన్ వేశారు. ప్లాన్‌లో భాగంగానే ఫిబ్రవరి 24వ తేదీన ఉప్పల్ భగాయత్‌లో హత్యాయత్నానికి ప్లాన్ వేశారు. అక్కడే వారు భాస్కర్ గౌడ్‌పై కత్తులతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకుని వచ్చినట్లు నటించి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది.వెంటనే భాస్కర్ గౌడ్‌లో పాటు అతడికి సహకరించిన వారిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News