Tuesday, March 4, 2025

దక్షిణ డిస్కం సిఎండిగా ముషారఫ్ ఫరూఖీ బాధ్యతల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ముషారఫ్ ఫరూఖీ బాధ్యతలు స్వీకరించారు. ఐఐటి మద్రాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడైన ముషారఫ్ ఫరూఖీ 2014 సంవత్సరంలో ఐఎఎస్‌కు ఎంపికయ్యారు. గతంలో జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్ , నిర్మల్ జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ శాఖలో డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. సిఎండీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం, సంస్థ డైరెక్టర్లతో విభాగాల వారీగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకు విశేష ప్రాధాన్యతను ఇస్తున్నదని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తూ, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టి. శ్రీనివాస్, జె. శ్రీనివాస రెడ్డి, కె. రాములు, సిహెచ్. మదన్ మోహన్ రావు, జి. పర్వతం, ఎస్. స్వామి రెడ్డి, జి. గోపాల్ తదిత అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News