Thursday, January 23, 2025

ముషారఫ్‌కు 2005లో భారత్‌లో బర్త్ సర్టిఫికెట్

- Advertisement -
- Advertisement -

దుబాయ్/ఇస్లామాబాద్ : దేశ విభజనకు ముందు ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో 1943లో జన్మించిన ముషారఫ్‌కు ఆరు దశాబ్దాల తరువాత 2005లో ఢిల్లీలోనే భారత ప్రభుత్వం జనన ధృవీకరణ పత్రం అందించింది. అప్పట్లో ఆయన భారత పర్యటనకు వచ్చారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ముషారఫ్‌కు ఈ పత్రాన్ని అపురూప కానుకగా అందించారు.

ఆయన ఢిల్లీలో పుట్టారు. పాకిస్థాన్‌లో ఏలారు. ఇప్పుడు దుబాయ్‌లో మరణించారని అప్పట్లో ఆయనకు బర్త్ సర్టిఫికెట్ జారీ క్రమంలో బాధ్యతలు నిర్వర్తించిన ఓ మాజీ అధికారి తెలిపారు. కార్గిల్ దుస్సాహసం తరువాత భారత పర్యటనకు వచ్చిన ముషారఫ్ అజ్మీర్ షరీఫ్ దర్గాకు వెళ్లారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఢిల్లీలో తాను పుట్టి పెరిగిన ప్రాంతాలల్లో తల్లితో కలిసి తిరిగి వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News