Wednesday, January 22, 2025

ముషీర్ ఖాన్ రికార్డు… ఈ టీమిండియా బ్యాట్స్‌మెన్ కు తమ్ముడు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అండర్ 19 వరల్డ్ కప్‌లో రెండు సెంచరీలతో బ్యాట్స్‌మెన్ ముషీర్ ఖాన్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఐర్లాండ్‌పై (118), న్యూజిలాండ్(131) సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. గతంలో శిఖర్ దావన్ అండర్-19 వరల్డ్ కప్ లో రెండు సెంచరీలు చేశాడు. ముషీర్ ఖాన్ కూడా రెండు సెంచరీలు చేసి రికార్డు సమం చేశాడు. 2024 అండర్ 19 వరల్డ్ కప్‌లో ముషీర్ ఖాన్ రెండు శతకాలు, ఒక హాఫ్ సెంచరీతో 235 పరుగులు చేశాడు.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టుకు సర్ఫరాజ్ ఖాన్ ఎంపికైన విషయం తెలిసిందే. దీంతో సర్ఫరాజ్‌ఖాన్‌కు తమ్ముడు ఈ ముషీర్ ఖాన్. అన్న బాటలో తమ్ముడు ప్రయాణం చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నాడు. సూపర్ సిక్స్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై యువ టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో యువ టీమిండియా సెమీ ఫైనల్లో అడుగు పెట్టినట్టేనని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

తదుపరి మ్యాచ్ ఫిబ్రవరి 2న నేపాల్‌తో భారత జట్టు ఆడనుంది. ఇప్పుడు ఐపిఎల్ ప్రాంచైజీలు ముషీర్ ఖాన్‌పై దృష్టి పెట్టాయి. అండర్ 19 వరల్డ్ కప్‌లో వరసగా సెంచరీలు చేస్తే టీమిండియా తలుపు తట్టడం ఖాయంగా కనిపిస్తుందని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. 2024 సీజన్ వేలంలో ఆన్ సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఇప్పుడు తీసుకోవాలని ప్రాంచైజీలు ఆరాటపడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News