Wednesday, January 22, 2025

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ముషీర్ ఖాన్

- Advertisement -
- Advertisement -

లక్నో: దులీప్ ట్రోఫీలో భారీ సెంచరీతో అదరగొట్టిన ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ముషీర్ ఖాన్ తన తండ్రి నౌషద్ ఖాన్ తో వెళ్తుండగా వారి వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇరానీ ట్రోఫీ కోసం ముషీర్ ఖాన్ తన జట్టుతో కలిసి లక్నోకు వెళ్లాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం తన తండ్రితో కలిసి కారులో అజమ్ గఢ్ నుంచి లక్నోకు వెళ్తుండగా వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. ముషీర్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్. దీంతో క్రికెట్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
పెద్దగా గాయాలు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం రిషభ్ పంత్ కూడా రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. నవంబర్ రెండో వారంలో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అదే సమయంలో టీమిండియా ఎ జట్టు కూడా ఆస్ట్రేలియా ఎ జట్టుతో రెండు మ్యాచ్ లు ఆడనుంది. దులీప్ ట్రోఫీలో బ్యాటింగ్ తో అదరగొట్టిన ముషీర్ ఖాన్ టీమిండియా ఎ జట్టులో చోటు ఖాయమని తెలుస్తోంది. ఇప్పుడు ప్రమాదానికి గురికావడంతో అతడిని తీసుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News